ఎల్బీనగర్: లక్ష్మీనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. 2001లో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు 2026 నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకగా నిర్వహిస్తున్నారు. కాలనీ పూర్వ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాలనీ ప్రారంభ దశలోని సమస్యలను సమిష్టి కృషితో అధిగమిస్తూ ప్రతి ఏటా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
గత 15–16 ఏళ్లుగా అన్నదానం నిర్వహిస్తూ, ఎల్బీనగర్‌లోనే తొలిసారిగా గణేష్ మండపం వద్ద ‘స్పెషల్ వెజ్ బిర్యానీ’ని అన్నప్రసాదంగా అందించే సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని ఆకాంక్షించారు. ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, ఉమాకాంత్ గౌడ్, మురళి, పూర్వ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, బాలు బాలకృష్ణ, ప్రస్తుత నిర్వాహకులు సాయిరామ్ చారి, అఖిల్, సాయి, బాలరాజ్, వెంకటేష్, మహేష్, అరుణ్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.





