Friday, 2 October 2026
  • Home  
  • లక్కవరంలో వృద్ధులకు న్యాయ అవగాహన, ఉచిత వైద్య శిబిరం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

లక్కవరంలో వృద్ధులకు న్యాయ అవగాహన, ఉచిత వైద్య శిబిరం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలోని మేరీ మాత వృద్ధుల ఆశ్రమంలో సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి లోక్ అదాలత్ సభ్యులు గొల్లమందల స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు ఉన్న న్యాయపరమైన హక్కులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో లక్కవరం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ భవన వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వృద్ధాశ్రమ సిబ్బంది, లోక్ అదాలత్ ఉద్యోగులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.