బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో కుటుంబంతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రొట్టెలు మార్పిడి.
నెల్లూరు: ఆదివారం స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సతీమణి కోటంరెడ్డి సుజిత, తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలసి స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలారు.. అనంతరం బారా షాహీద్ దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శాసనసభ్యులుగా కావాలని ఆకాంక్షిస్తూ తొలిరొట్టెను అందుకోవడం జరిగిందని, రెండవ రొట్టెను రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నేత నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధిపై దిశగా నడిచే విధంగా ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు.రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ.. మూడవ రొట్టె అందుకోవడం జరిగిందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తాను గత రెండు పర్యాయాలు గా శాసన సభ్యులుగా ఉండడం జరిగిందని, 12వ సారి బారా షహీద్ దర్గా రొట్టెల పండగలో పాల్గొనడం జరిగిందన్నారు. పవిత్ర దర్గా తన నియోజకవర్గ పరిధిలో ఉండడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. బారా షాహిద్ దర్గాను దర్శించుకోవడం అనేది కుటుంబ పరంగా వస్తున్న ఒక సెంటిమెంట్ గా ఆయన తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలవ్యవధిలో నియోజకవర్గ పరిధిలో సుమారు 700 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, కొన్ని పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, ఆయన తెలిపారు. రానున్న కాలంలో దర్గా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.


