వ్యవసాయ ఉత్పత్తులను పొలం నుండి నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చే నూతన విధానాన్ని (ఫార్మ్ టు హోమ్) అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల మిషన్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను తక్కువ వ్యయంతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (FPO) ద్వారా నేరుగా సరఫరా చేయాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రకృతి సేద్యం ప్రోత్సహించాలని, భూసార పరీక్షల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, డ్రోన్లు, ఆధునిక యంత్రాల వినియోగం పెంచాలని స్పష్టం చేశారు.

రైతు నుంచి నేరుగా ఇంటికే: కూరగాయల సరఫరాకు సరికొత్త ప్లాన్!