Monday, 21 September 2026
  • Home  
  • రేషన్ డీలర్లకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి తహసీల్దారుకి వినితి పత్రం
- అన్నమయ్య

రేషన్ డీలర్లకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి తహసీల్దారుకి వినితి పత్రం

రేషన్ డీలర్లకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి తహసీల్దారుకి వినితి పత్రం -రేషన్ బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని సమీక్షించి, నిలిపివేయాలి – రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ సెప్టెంబరు నెల నుండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయు 10 శాతం బ్రోకెన్ రైస్ బియ్యం బస్తాలపై నూతనంగా క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని. ఆ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ప్రతి రేషన్ డీలర్ మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుండి దిగుమతి అయ్యే ప్రతి బస్తాను రేషన్ షాపులో దిగుమతి చేస్తున్న సమయంలో స్కాన్ చేస్తూ తన రేషన్ షాపు స్టాకు నిల్వలలో నమోదు చేయవలసి రావటం, అదే విధంగా ప్రతి రెండు బస్తాలను రేషన్ పంపిణీ చేసే సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఈపోస్ నందు నమోదు చేస్తూ పంపిణీ చేయవలసి రావటం వలన డీలర్లకు పని భారం మరియు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వస్తోంది అని. రేషన్ డీలర్లలో చాలా మందికి ఇప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ అందుబాటులో లేకపోవడం వలన ఈ స్కానింగ్ చేసే సమయంలో యాప్ ను డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నందలూరు మండల తహసిల్దార్ కు వినీతి పత్రం ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో మండల లెవెల్ స్టాక్ పాయింట్ల నందు క్యూఆర్ కోడ్ నమోదు చేయు అంశాన్ని ప్రవేశపెట్టడం జరగలేదు అని. పూర్తి అనుభవం ఉన్న ఉద్యోగస్తులు, అధిక సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉన్న మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో కూడా క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ప్రవేశపెట్టకపోవడం వలన డీలర్లకు ఇప్పటికే ఎన్నో దశాబ్దాల నుండి వచ్చుచున్న తరుగుల సమస్యను పరిష్కరించకపోగా, ఆ తరుగులను కూడా అధికారికంగా డీలర్లను మండల లెవెల్ స్టాక్ పాయింట్లో జరుగుతున్న తప్పులకు బాధ్యులను చేయటం తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది అని తెలిపారు. ఇప్పటికే ప్రతి నెల అనధికారికంగా ప్రతి రేషన్ డీలరు తనకు ఉన్న అల్యాట్మెంట్ను బట్టి 100 కేజీల నుండి 300 కేజీల వరకు మండల లెవెల్ స్టాక్ పాయింట్లో జరుగుతున్న అవకతవకల వలన నష్టపోతున్నారు అని. దీనిని సరి చేయకపోగా రేషన్ షాపులలో ప్రతి బస్తా 50 కేజీలుగా నిర్ధారిస్తూ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయటం వలన మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో జరుగుతున్న అవకతవకలను అధికారికంగా రేషన్ డీలర్లతో మాఫీ చేయడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఆవేదన చెందుతున్నారు అని తెలిపారు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు పరిష్కారం చేయవలసిన సమయంలో వాటిన్నింటి పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రేషన్ డీలర్లను బాధ్యులను చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్న నూతన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని ఒకసారి సమీక్షించి అమలు చేయకుండా నిలిపివేయవలసిందిగా 29,796 మంది రేషన్ డీలర్లు అందరి తరపున రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 483/18 తరుపున నందలూరు తహసీల్దారు కు వినీతి పత్రం అందించారు.

రేషన్ డీలర్లకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి తహసీల్దారుకి వినితి పత్రం
-రేషన్ బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని సమీక్షించి, నిలిపివేయాలి
– రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ

సెప్టెంబరు నెల నుండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయు 10 శాతం బ్రోకెన్ రైస్ బియ్యం బస్తాలపై నూతనంగా క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని. ఆ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ప్రతి రేషన్ డీలర్ మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుండి దిగుమతి అయ్యే ప్రతి బస్తాను రేషన్ షాపులో దిగుమతి చేస్తున్న సమయంలో స్కాన్ చేస్తూ తన రేషన్ షాపు స్టాకు నిల్వలలో నమోదు చేయవలసి రావటం, అదే విధంగా ప్రతి రెండు బస్తాలను రేషన్ పంపిణీ చేసే సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఈపోస్ నందు నమోదు చేస్తూ పంపిణీ చేయవలసి రావటం వలన డీలర్లకు పని భారం మరియు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వస్తోంది అని. రేషన్ డీలర్లలో చాలా మందికి ఇప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ అందుబాటులో లేకపోవడం వలన ఈ స్కానింగ్ చేసే సమయంలో యాప్ ను డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నందలూరు మండల తహసిల్దార్ కు వినీతి పత్రం ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో మండల లెవెల్ స్టాక్ పాయింట్ల నందు క్యూఆర్ కోడ్ నమోదు చేయు అంశాన్ని ప్రవేశపెట్టడం జరగలేదు అని. పూర్తి అనుభవం ఉన్న ఉద్యోగస్తులు, అధిక సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉన్న మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో కూడా క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ప్రవేశపెట్టకపోవడం వలన డీలర్లకు ఇప్పటికే ఎన్నో దశాబ్దాల నుండి వచ్చుచున్న తరుగుల సమస్యను పరిష్కరించకపోగా, ఆ తరుగులను కూడా అధికారికంగా డీలర్లను మండల లెవెల్ స్టాక్ పాయింట్లో జరుగుతున్న తప్పులకు బాధ్యులను చేయటం తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది అని తెలిపారు. ఇప్పటికే ప్రతి నెల అనధికారికంగా ప్రతి రేషన్ డీలరు తనకు ఉన్న అల్యాట్మెంట్ను బట్టి 100 కేజీల నుండి 300 కేజీల వరకు మండల లెవెల్ స్టాక్ పాయింట్లో జరుగుతున్న అవకతవకల వలన నష్టపోతున్నారు అని. దీనిని సరి చేయకపోగా రేషన్ షాపులలో ప్రతి బస్తా 50 కేజీలుగా నిర్ధారిస్తూ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయటం వలన మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో జరుగుతున్న అవకతవకలను అధికారికంగా రేషన్ డీలర్లతో మాఫీ చేయడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఆవేదన చెందుతున్నారు అని తెలిపారు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు పరిష్కారం చేయవలసిన సమయంలో వాటిన్నింటి పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రేషన్ డీలర్లను బాధ్యులను చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్న నూతన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని ఒకసారి సమీక్షించి అమలు చేయకుండా నిలిపివేయవలసిందిగా 29,796 మంది రేషన్ డీలర్లు అందరి తరపున రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 483/18 తరుపున నందలూరు తహసీల్దారు కు వినీతి పత్రం అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.