Monday, 7 September 2026
  • Home  
  • రేణిగుంట విమానాశ్రయంలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం
- తిరుపతి

రేణిగుంట విమానాశ్రయంలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

*పనబాక భూలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ఆత్మీయ స్వాగతం* *నారా లోకేష్‌ను కలిసిన పనబాక భూలక్ష్మి పలు నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేత మృతి చెందిన టీడీపీ నేతల* *కుటుంబాలకు పరామర్శ రేణిగుంటకు చేరుకున్న మంత్రి నారాలోకేష్* *తిరుపతి సెప్టెంబర్ 7 పున్నమి న్యూస్* ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మృతి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి నియోజకవర్గ అబ్జర్వర్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విజయవాడ కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి విమానాశ్రయంలో నారా లోకేష్‌ను కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలను పనబాక భూలక్ష్మి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అనంతరం నారా లోకేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలానికి చెందిన మృతి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నారా లోకేష్‌కు స్వాగతం పలికారు.

*పనబాక భూలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ఆత్మీయ స్వాగతం*

*నారా లోకేష్‌ను కలిసిన పనబాక భూలక్ష్మి పలు నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేత మృతి చెందిన టీడీపీ నేతల*

*కుటుంబాలకు పరామర్శ రేణిగుంటకు చేరుకున్న మంత్రి నారాలోకేష్*

*తిరుపతి సెప్టెంబర్ 7 పున్నమి న్యూస్*

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మృతి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

చంద్రగిరి నియోజకవర్గ అబ్జర్వర్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విజయవాడ కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి విమానాశ్రయంలో నారా లోకేష్‌ను కలిసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలను పనబాక భూలక్ష్మి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

అనంతరం నారా లోకేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలానికి చెందిన మృతి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నారా లోకేష్‌కు స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.