
*రిమ్స్ హాస్పిటల్ డ్యూటీ నర్స్ ప్రమీల గారిని నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించిన మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*28-09-2026*హైదరాబాద్*హైదరాబాద్: ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో పలువురు చిన్నారులు మృతి చెందగా, మరికొందరు చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందేఈ ఘటనలో ప్రమాద సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పలువురు చిన్నారులను తన చేతులతో కాపాడిన డ్యూటీ నర్స్ ప్రమీల గారు, ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారుఈ నేపథ్యంలో నేడు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు,* డ్యూటీ నర్స్ ప్రమీల గారిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో చిన్నారులను కాపాడేందుకు ఆమె చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. ప్రమీల గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారుఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్లు తుల ఉమా గారు, బిందు ఆంగోత్ గారు తదితరులు పాల్గొన్నారు

