బాడంగి, అక్టోబర్ 1: పీఎం శ్రీ బాడంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అండర్–16 హైజంప్‌లో అర్నిపల్లి సందీప్, అండర్–14 ట్రయాథ్లాన్‌లో చుక్క భాను ప్రసాద్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ పోటీలు అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరగనున్నాయి.
అండర్–17 బేస్‌బాల్‌లో పైల రేవతి, అండర్–17 బేస్‌బాల్‌తో పాటు అండర్–19 సాఫ్ట్‌బాల్‌లో మీసాల నిఖిల్ లోకేష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్‌ఎం డి. సత్యన్నారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు బాడంగి విద్యార్థులు
బాడంగి, అక్టోబర్ 1: పీఎం శ్రీ బాడంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–16 హైజంప్‌లో అర్నిపల్లి సందీప్, అండర్–14 ట్రయాథ్లాన్‌లో చుక్క భాను ప్రసాద్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ పోటీలు అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరగనున్నాయి. అండర్–17 బేస్‌బాల్‌లో పైల రేవతి, అండర్–17 బేస్‌బాల్‌తో పాటు అండర్–19 సాఫ్ట్‌బాల్‌లో మీసాల నిఖిల్ లోకేష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్‌ఎం డి. సత్యన్నారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

