Tuesday, 29 September 2026
  • Home  
  • రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆసిఫాబాద్ గురుకుల విద్యార్థికి వెండి పతకం
- ASIFABAD

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆసిఫాబాద్ గురుకుల విద్యార్థికి వెండి పతకం

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా JNS స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 41వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థి జాడి సాయికుమార్ సత్తా చాటాడు. జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచిన సాయికుమార్ రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆసిఫాబాద్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికుమార్ రాష్ట్ర స్థాయిలో పతకం సాధించడం పట్ల కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ విద్యార్థి సాయికుమార్‌ను అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వెండి పతకం సాధించిన సాయికుమార్‌ను ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, PD కోట యాదగిరి, PET ఎస్. ప్రసాద్, హౌస్ మాస్టర్ కోసరి మహేష్‌తో పాటు కళాశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది.

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా JNS స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 41వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థి జాడి సాయికుమార్ సత్తా చాటాడు.

జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచిన సాయికుమార్ రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆసిఫాబాద్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికుమార్ రాష్ట్ర స్థాయిలో పతకం సాధించడం పట్ల కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ విద్యార్థి సాయికుమార్‌ను అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

వెండి పతకం సాధించిన సాయికుమార్‌ను ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, PD కోట యాదగిరి, PET ఎస్. ప్రసాద్, హౌస్ మాస్టర్ కోసరి మహేష్‌తో పాటు కళాశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.