Friday, 2 October 2026
  • Home  
  • రాయలసీమకు న్యాయం చేయాలి శ్రీబాగ్ స్ఫూర్తిని అమలు చేయాలి
- నంద్యాల

రాయలసీమకు న్యాయం చేయాలి శ్రీబాగ్ స్ఫూర్తిని అమలు చేయాలి

నంద్యాల : శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో రాయలసీమకు పాలన, అభివృద్ధి, సాగునీటిలో సమన్యాయం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంజీవనగర్ గేట్ సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మూడేళ్లలో రూ.60 వేల కోట్లు కేటాయించాలని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. చెరువులు, కాలువలు, పెన్నా పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. నంద్యాలను సీడ్ హబ్‌గా అభివృద్ధి చేయాలంటే ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములు, పరిశోధనా వసతులను పరిరక్షించాలని, తాత్కాలిక కలెక్టరేట్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.కార్యక్రమంలో సమితి నాయకులు ఏరువ రామచంద్రరెడ్డి, యర్రం శంకర్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్, ప్రొఫెసర్ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.