అక్టోబర్ 2 నిర్మల్ పున్నమి ప్రతినిధి
నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు గారు హాజరై షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమానులు శ్రీహరి రావు గారిని ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ప్రజలకు అన్ని రకాల షాపింగ్ అవసరాలను ఒకే చోట అందించాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


