Friday, 24 July 2026
  • Home  
  • రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి JDRF ఘన సన్మానం
- తూర్పు గోదావరి

రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి JDRF ఘన సన్మానం

రాజమహేంద్రవరం, జూలై 24 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): ది రాజమండ్రి ప్రెస్ క్లబ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు జర్నలిస్ట్ డెమోక్రసీ రైట్స్ ఫోరం (JDRF) ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. JDRF రాష్ట్ర కార్యదర్శి మేడ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మారంపూడి సోమరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేఖర్ల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. అలాగే ప్రెస్ క్లబ్‌లో కొత్త సభ్యులకు వెంటనే సభ్యత్వాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోతా బాల విజయ సారధి మాట్లాడుతూ నూతన సభ్యులకు సభ్యత్వాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విలేఖర్ల సమస్యల పరిష్కారానికి JDRFతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో JDRF జిల్లా ఉపాధ్యక్షులు గోరెలా రమణ, వై. నరేష్, కోశాధికారి పిచ్చుక మహేష్, మీడియా కో-ఆర్డినేటర్ రమేష్, సభ్యులు రాఘవేంద్ర, యాకోబ్, సోమశేఖర్, నాగరాజు, కత్తి శ్రీను, ఇతర నాయకులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

రాజమహేంద్రవరం, జూలై 24 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు జర్నలిస్ట్ డెమోక్రసీ రైట్స్ ఫోరం (JDRF) ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
JDRF రాష్ట్ర కార్యదర్శి మేడ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మారంపూడి సోమరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేఖర్ల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. అలాగే ప్రెస్ క్లబ్‌లో కొత్త సభ్యులకు వెంటనే సభ్యత్వాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోతా బాల విజయ సారధి మాట్లాడుతూ నూతన సభ్యులకు సభ్యత్వాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విలేఖర్ల సమస్యల పరిష్కారానికి JDRFతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో JDRF జిల్లా ఉపాధ్యక్షులు గోరెలా రమణ, వై. నరేష్, కోశాధికారి పిచ్చుక మహేష్, మీడియా కో-ఆర్డినేటర్ రమేష్, సభ్యులు రాఘవేంద్ర, యాకోబ్, సోమశేఖర్, నాగరాజు, కత్తి శ్రీను, ఇతర నాయకులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.