.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి పౌరుడు తనవంతు బాధ్యత నిర్వహించాలని జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ కోరారు. దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటి ఆమె మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని కోరారు సందర్భంగా పర్యావరణాన్ని కోరుతూ లీగల్ వాలంటీర్స్ నిర్వహించిన ప్రదర్శనలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆదేశాల మేరకు వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహన పెంచడానికి ఈరోజు కొన్ని చర్యలు చేపడతారని, అందువలన అంటే మన చుట్టూ ఉన్న గాలి నీరు నేల చెట్లు జంతుజాలంతో కూడిన మొత్తం ప్రకృతి వ్యవస్థ ఇది సకల జీవుల మనగడుకు ఆరోగ్యానికి అభివృద్ధికి అత్యంత అవసరం అని ఆమె అన్నారు.పర్యవరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కాలుష్యాన్ని అరికట్టడంమొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని వైజె పద్మశ్రీ తెలిపినారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ టీ గోపాల్ రెడ్డి వై కోటేశ్వరరావు, దుర్గమ్మ తదితరులు చెట్లను నాటినారు.



