ఖానాపురం పున్నమి ప్రతినిధి:
రాగంపేట గ్రామం, ఖానాపురం మండలం, వరంగల్ జిల్లాకు చెందిన కన్నె కుమారస్వామి – రమనీల దంపతుల పెద్ద కుమారుడు వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఎ.ఆర్ 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు)కు యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలం పి.యస్ ఫంక్షన్ హాల్ లో భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ రంగాలలో సేవాలందిస్తున్న రక్తదాతలకు – సమాజ సేవకులకు, ఉపాధ్యాయులకు ఉత్తమ సేవా పురస్కారం – 2026 అందడం జరిగింది.గత 21 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రక్తదానం పై నేను స్వయంగా 38 సార్లు రక్తదానం చేశాను.అత్యవసర సమయంలో ఉన్న పేషెంట్లకు రక్తదాతల సహకారంతో 18,832 మందికి ఉచితంగా రక్తం అందించడం, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 86 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, కరోనా (కోవిడ్ – 19) సమయంలో 235 మందికి ప్లాస్మాదానం చేయించడం, దాతల సహకారంతో 430 రోజులు అన్నదాన కార్యక్రమలు నిర్వహించడం, వీటితోపాటు విద్యాభివృద్ధి, వివిధ అంశాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, ఆర్థిక సహాయం, అవయవదానం పై అవగాహన మొదలైన కార్యక్రమాలు చేయడం. జరిగింది.



