రాజంపేట: వినాయక చవితి సందర్భంగా రాజంపేట పట్టణంలోని విద్యుత్‌నగర్‌లో విఘ్నేశ్వరుని మండపం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడికోట వెంకటసుబ్బారెడ్డి గారికి యువత, స్థానికులు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దలు, యువత సమక్షంలో సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా యువతకు గడికోట వెంకటసుబ్బారెడ్డి బాణసంచా అందజేశారు. అనంతరం లడ్డూ వేలంపాటను దగ్గరుండి నిర్వహించారు. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న వారికి ఆయన స్వయంగా లడ్డూను అందజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.
విద్యుత్‌నగర్ 23వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది యువత, మహిళలు, స్థానికులు హాజరయ్యారు. దీంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. గణనాథుని దర్శనం, పూజలు, అన్నదానం, లడ్డూ వేలంపాట కార్యక్రమాలతో సందడి నెలకొంది.
కార్యక్రమంలో రంగరాజు, పోతుల శ్రీనివాసులు, హరి, రమణయ్య, ప్రసాద్, నరేష్, హర్ష, నాగ, యశ్వంత్, నాని, సురేష్ తదితర యువతతో పాటు మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
Uploaded Video:



