Tuesday, 30 June 2026
  • Home  
  • యువతకు అండగా కూటమి ప్రభుత్వం: గంటా* *మెగా జాబ్ మేళాకు భారీ స్పందన*
- ఆంధ్రప్రదేశ్

యువతకు అండగా కూటమి ప్రభుత్వం: గంటా* *మెగా జాబ్ మేళాకు భారీ స్పందన*

మధురవాడ ఉద్యోగార్థులైన యువతకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం భీమిలిలో జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పీఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం భీమిలి మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ తో భీమిలికి ప్రత్యేక గుర్తింపు లభించిందని, దేశం మొత్తం విశాఖవైపు చూస్తోందన్నారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జాబ్ మేళాలకు భిన్నంగా ఈ మెగా జాబ్ మేళా చేయాలని భావించామని భారీగా వచ్చిన యువత తమ సంకల్పాన్ని నెరవేర్చారని తెలియజేశారు. 50 కంపెనీలు వస్తాయనే అంచనాతో ప్రారంభమైన ప్రయత్నం గంటా రవితేజ టీం, అధికారులు, టీడీపీ శ్రేణుల కృషితో 135 కంపెనీల స్థాయికి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. జాబ్ మేళాపై ఎంతో నమ్మకంతో హాజరైన 10 వేల మంది యువతకు అభినందనలు తెలిపారు. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన పారిశ్రామికవేత్తలు.. సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేశ్ యాక్షన్ తో రాష్ట్రానికి క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. 24 నెలల్లో 25 లక్షల కోట్ల పెట్టుబడులు కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందని, నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో జరగబోయే సదస్సులో పెట్టుబడుల వెల్లువ చూస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు.. విశాఖకు మధ్యలో ఉన్న భీమిలి ప్రాంతం హైదరాబాద్ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి మాదిరిగా శరవేగంగా అభివృద్ధి చెందబోతోందని చెప్పారు. ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ వారం రోజుల్లో డ్రోన్ టెక్నాలజీని నేర్చుకునేలా సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా ప్రారంభించిన డ్రోన్ అకాడమీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొత్తగా సిద్ధం చేసిన క్రీడా మైదానాన్ని గంటా ప్రారంభించారు. కార్యక్రమంలో యువ నాయకుడు గంటా రవితేజ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, సాంకేతిక విద్యా సంస్థల చైర్మన సుంకర రాజేంద్ర, డైరక్టర్ రాహుల్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు గోవిందరావు, అరుణ, హోటలియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్, పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, గరే గుర్నాథ్, లొడగల జానకిరామ్, కసిరెడ్డి దామోదరరావు, సరగడ అప్పారావు, వెంకటప్పడు, కోరాడ రమణ, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మన్యాల సోంబాబు, బోయి రమాదేవి, మంగాదేవి, నాగోతి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మధురవాడ

ఉద్యోగార్థులైన యువతకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం భీమిలిలో జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పీఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం భీమిలి మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ తో భీమిలికి ప్రత్యేక గుర్తింపు లభించిందని, దేశం మొత్తం విశాఖవైపు చూస్తోందన్నారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జాబ్ మేళాలకు భిన్నంగా ఈ మెగా జాబ్ మేళా చేయాలని భావించామని భారీగా వచ్చిన యువత తమ సంకల్పాన్ని నెరవేర్చారని తెలియజేశారు. 50 కంపెనీలు వస్తాయనే అంచనాతో ప్రారంభమైన ప్రయత్నం గంటా రవితేజ టీం, అధికారులు, టీడీపీ శ్రేణుల కృషితో 135 కంపెనీల స్థాయికి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. జాబ్ మేళాపై ఎంతో నమ్మకంతో హాజరైన 10 వేల మంది యువతకు అభినందనలు తెలిపారు.
ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన పారిశ్రామికవేత్తలు.. సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేశ్ యాక్షన్ తో రాష్ట్రానికి క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. 24 నెలల్లో 25 లక్షల కోట్ల పెట్టుబడులు కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందని, నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో జరగబోయే సదస్సులో పెట్టుబడుల వెల్లువ చూస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు.. విశాఖకు మధ్యలో ఉన్న భీమిలి ప్రాంతం హైదరాబాద్ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి మాదిరిగా శరవేగంగా అభివృద్ధి చెందబోతోందని చెప్పారు. ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ వారం రోజుల్లో డ్రోన్ టెక్నాలజీని నేర్చుకునేలా సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా ప్రారంభించిన డ్రోన్ అకాడమీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొత్తగా సిద్ధం చేసిన క్రీడా మైదానాన్ని గంటా ప్రారంభించారు. కార్యక్రమంలో యువ నాయకుడు గంటా రవితేజ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, సాంకేతిక విద్యా సంస్థల చైర్మన సుంకర రాజేంద్ర, డైరక్టర్ రాహుల్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు గోవిందరావు, అరుణ, హోటలియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్, పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, గరే గుర్నాథ్, లొడగల జానకిరామ్, కసిరెడ్డి దామోదరరావు, సరగడ అప్పారావు, వెంకటప్పడు, కోరాడ రమణ, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మన్యాల సోంబాబు, బోయి రమాదేవి, మంగాదేవి, నాగోతి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.