తేటగుంట, ఆగస్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా తేటగుంటలో మాజీ మంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని నల్లమిల్లి మనోజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడికి పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా పాల్గొన్నారు. అనపర్తిలో టీడీపీ బలోపేతం, కూటమి సమన్వయంపై నాయకులు చర్చించారు.


