Wednesday, 12 August 2026
  • Home  
  • మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి”:..పాల్వాయి హరీష్ బాబు* సిర్పూర్ శాసనసభ్యులు
- ASIFABAD

మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి”:..పాల్వాయి హరీష్ బాబు* సిర్పూర్ శాసనసభ్యులు

*”మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి”: సిర్పూర్ శాసనసభ్యులు డా..పాల్వాయి హరీష్ బాబు* *బెజ్జూర్*: మండలంలోని రైతు వేదికలో ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. *ఈ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడుతూ బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదన తుది దశకు చేరిందని, ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాగానే పనులు మొదలు పెడదామని తెలిపారు. అలాగే సలుగుపల్లి వద్ద నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా తాసిల్దార్ గారిని ఆదేశించారు. అవసరమైతే సోమినిలో ఇంకో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్లకు సూచిస్తూ నార్మల్ డెలివరీ కేసెస్ బెజ్జూరు సామాజిక ఆసుపత్రిలోనే నిర్వహించాలని ఆదేశించారు.* *బెజ్జూర్ – సోమిని మధ్య రెండు వంతెనల నిర్మాణం కోసం అటవీ శాఖ మంత్రితో సమావేశం అవుతామని తెలిపారు. ఎక్కడా లోవోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.* *అనంతరం వివిధ శాఖల అధికారులతో ఒక్కో శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎంపీడీవో బండారి ప్రవీణ్, తాసిల్దార్ రామ్మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ నదీమ్ కుదుస్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

*”మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి”: సిర్పూర్ శాసనసభ్యులు డా..పాల్వాయి హరీష్ బాబు*

*బెజ్జూర్*: మండలంలోని రైతు వేదికలో ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

*ఈ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడుతూ బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదన తుది దశకు చేరిందని, ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాగానే పనులు మొదలు పెడదామని తెలిపారు. అలాగే సలుగుపల్లి వద్ద నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా తాసిల్దార్ గారిని ఆదేశించారు. అవసరమైతే సోమినిలో ఇంకో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్లకు సూచిస్తూ నార్మల్ డెలివరీ కేసెస్ బెజ్జూరు సామాజిక ఆసుపత్రిలోనే నిర్వహించాలని ఆదేశించారు.*

*బెజ్జూర్ – సోమిని మధ్య రెండు వంతెనల నిర్మాణం కోసం అటవీ శాఖ మంత్రితో సమావేశం అవుతామని తెలిపారు. ఎక్కడా లోవోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.*

*అనంతరం వివిధ శాఖల అధికారులతో ఒక్కో శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.*

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎంపీడీవో బండారి ప్రవీణ్, తాసిల్దార్ రామ్మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ నదీమ్ కుదుస్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.