చైనాలో ఉన్న వైద్యుడు డాక్టర్ సయ్యద్ ఎండీ గౌస్, 5G రోబోటిక్ టెలిసర్జరీ సాంకేతికతతో దాదాపు 3,900 కి.మీ. దూరంలో ఉన్న హైదరాబాద్ ‘AINU’ ఆసుపత్రిలోని 57 ఏళ్ల మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న రోగికి చైనా నుండి రోబో చేతులను నియంత్రిస్తూ, 100 మిల్లీ సెకన్ల కంటే తక్కువ లాటెన్సీతో, రియల్ టైమ్ 3D ఇమేజ్‌లను చూస్తూ కేవలం 90 నిమిషాల్లో ఈ సర్జరీని పూర్తి చేశారు. వైద్యరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ వివరాలను AINU వైద్య బృందం వెల్లడించింది.


