Thursday, 24 September 2026
  • Home  
  • మృతుడి కుటుంబానికి జనసేన నేత ఆర్థిక భరోసా
- కడప

మృతుడి కుటుంబానికి జనసేన నేత ఆర్థిక భరోసా

సిద్ధవటం మండలంలోని ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన ఎద్దుల విజయ్‌కుమార్ ఈనెల 20న గుండెపోటుతో మృతి చెందారు. ఆకస్మికంగా కుటుంబ పెద్దను కోల్పోయిన విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అతికారి కృష్ణ మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. కష్టకాలంలో కుటుంబానికి తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు.అతికారి కృష్ణ తరఫున సిద్దవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ మహబూబ్ బాషా (బాబి) బుధవారం ఎస్.రాజంపేటలోని మృతుడి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి కుమారుడికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. విజయ్‌కుమార్ మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో జనసేన పార్టీ తరఫున అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.