ముఖ్య సమాచారం – గణేష్ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ఆన్లైన్ అనుమతి
వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తెలియజేయునది ఏమనగా,
రానున్న వినాయక చవితి/గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, మండపం ఏర్పాటు మరియు ఉత్సవ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తు అనుమతులు పొందవలసి ఉంటుంది.
ఉత్సవ నిర్వాహకుల సౌకర్యార్థం వివిధ శాఖలకు సంబంధించిన అనుమతులను ఒకే వేదిక ద్వారా పొందేందుకు Single-Window Online Permission System అందుబాటులోకి తీసుకురాబడింది.
ఆన్లైన్ అనుమతి పోర్టల్:
https://ganeshutsav.net
కావున, వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ మండపం/విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన వివరాలను పై పోర్టల్లో నమోదు చేసి, ముందస్తుగా ఆన్లైన్ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించడమైనది.
శాంతిభద్రతలు, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఇతర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన ముందస్తు అనుమతులు పొందిన అనంతరం మాత్రమే ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించవలెను.
అందువల్ల సంబంధిత గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ ఆన్లైన్ అనుమతి విధానాన్ని సద్వినియోగం చేసుకొని అనుమతులు పొందవలసినదిగా తెలియజేస్తున్నాము.!
– *ఎస్.ఐ.*
*వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్*
*తిరుపతి జిల్లా.*

