Thursday, 24 September 2026
  • Home  
  • మానవత్వం చాటుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి*..*రోడ్డు ప్రమాద బాధితులకు సొంత వాహనంలో ఆస్పత్రికి తరలింపు* అల్లూరు :బుధవారం23ప్రజాసేవే
- ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి*..*రోడ్డు ప్రమాద బాధితులకు సొంత వాహనంలో ఆస్పత్రికి తరలింపు* అల్లూరు :బుధవారం23ప్రజాసేవే

*మానవత్వం చాటుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి*..*రోడ్డు ప్రమాద బాధితులకు సొంత వాహనంలో ఆస్పత్రికి తరలింపు* అల్లూరు :బుధవారం23ప్రజాసేవే పరమావధిగా భావించే కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనే కాకుండా,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ తాను ఎప్పుడూ ముందుంటానని నిరూపించారు.అల్లూరు మండలం బట్రకాగొల్లు గ్రామానికి చెందిన సింబోతు మహేంద్ర తన కుటుంబంతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, అల్లూరు శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తూ బండి కిందపడిపోయారు. ఈ హఠాత్ ప్రమాదంలో మహేంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.అల్లూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, మార్గమధ్యంలో రోడ్డు పక్కన ప్రమాదానికి గురై పడి ఉన్న కుటుంబాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి, కారు దిగి బాధితుల వద్దకు పరుగెత్తుకెళ్లారు.గాయపడిన వారిని ఆత్మీయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. సమయం వృధా చేయకుండా, తక్షణ వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో తన సొంత కారులోనే గాయపడిన కుటుంబ సభ్యులందరినీ ఎక్కించి ఎమ్మెల్యే సిబ్బందితో అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి చేరుకున్న అనంతరం, మెరుగైన అత్యవసర వైద్యం త్వరితగతిన అందించాలని డాక్టర్లకు సూచించారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.ఆపదలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి సమయస్ఫూర్తిని, విశాల హృదయాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. “ప్రజల కష్టాల్లో నిరంతరం అండగా నిలిచే నిజమైన ప్రజాప్రతినిధి కావలి ఎమ్మెల్యే గారు” అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.