నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గొలగమూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వై.జె. పద్మశ్రీ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, లోక్ అదాలత్ సేవలపై అవగాహన కల్పించారు. అవసరమైన సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు మత్తు పదార్థాల నివారణపై నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీధి రమణ ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.



