Saturday, 27 June 2026
  • Home  
  • మాతమ్మ తల్లి కొలుపుల వైభవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసుకున్న బొజ్జల రిషిత రెడ్డి
- తిరుపతి

మాతమ్మ తల్లి కొలుపుల వైభవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసుకున్న బొజ్జల రిషిత రెడ్డి

శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామంలోని అరుంధతి వాడలో శ్రీశ్రీశ్రీ మాతమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల రిషిత రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ మాతమ్మ తల్లిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కన్నలి ప్రతాప్ రెడ్డి, బాలాజీ రెడ్డి, శివకుమార్ రెడ్డి, బాబు రెడ్డి, మణి స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.