Wednesday, 23 September 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు కొట్టడం దుర్మార్గమైన చర్య : బత్తిని శ్రీనివాస్ గౌడ్
- వరంగల్

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు కొట్టడం దుర్మార్గమైన చర్య : బత్తిని శ్రీనివాస్ గౌడ్

ఖానాపురం పున్నమి ప్రతినిధి: వరంగల్ ఎంజీఎం పెద్ద దవాఖాన ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ పెద్ద దిక్కు లాంటిదని, అలాంటి హాస్పిటల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఏఎంసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. హాస్పిటల్ పైకప్పు ఊడి పడిన ఘటనను పరిశీలించడానికి వెళ్లిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిని పోలీసులు అమానుషంగా కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను వెలికితీయడమే నాయకుల లక్షణం. అలాంటి మాజీ ఎమ్మెల్యే పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం పోలీసుల వికృత చేష్టలకు నిదర్శనం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. ఎప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండదని పోలీసులు గమనించాలి. ఇలాంటి చర్యలు పునరావృతమైతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి కొట్లాడుతాం. సహించేది లేదు” అని బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
వరంగల్ ఎంజీఎం పెద్ద దవాఖాన ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ పెద్ద దిక్కు లాంటిదని, అలాంటి హాస్పిటల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఏఎంసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఖండించారు.
హాస్పిటల్ పైకప్పు ఊడి పడిన ఘటనను పరిశీలించడానికి వెళ్లిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిని పోలీసులు అమానుషంగా కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను వెలికితీయడమే నాయకుల లక్షణం. అలాంటి మాజీ ఎమ్మెల్యే పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం పోలీసుల వికృత చేష్టలకు నిదర్శనం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. ఎప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండదని పోలీసులు గమనించాలి. ఇలాంటి చర్యలు పునరావృతమైతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి కొట్లాడుతాం. సహించేది లేదు” అని బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.