ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 12 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు నుంచి సైదాపురం వెళ్లే మార్గమధ్యలో మనుబోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదాపురంకు చెందిన కొత్తలూరు కళ్యాణ్ (23), తండ్రి చంద్రశేఖర్, నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కళ్యాణ్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై శివ రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మనుబోలు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 12 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు నుంచి సైదాపురం వెళ్లే మార్గమధ్యలో మనుబోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదాపురంకు చెందిన కొత్తలూరు కళ్యాణ్ (23), తండ్రి చంద్రశేఖర్, నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కళ్యాణ్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై శివ రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

