మణిపూర్‌లోని ఉఖ్రూల్ జిల్లాలో భద్రతా సిబ్బంది ఎస్కార్ట్ చేస్తున్న సరుకు రవాణా ట్రక్కుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ నితీష్ దాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
బియ్యం సరఫరా చేస్తున్న ట్రక్కు ఇంఫాల్ నుంచి ఉఖ్రూల్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.


