Wednesday, 9 September 2026
  • Home  
  • మంథనిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2026
- పెద్దపల్లి

మంథనిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2026

మంథని, సెప్టెంబర్ 09: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్)-2026లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని పట్టణంలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫోద్దిన్, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ శారదలను కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేసి సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేసిన అనంతరం, ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెల ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులతో పాటు జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా నమోదు చేస్తామని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావులేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని డివైస్‌ఓ వెంకటేశ్వర్లు, మంథని ఎంపీఎస్‌ఓ సంధ్యారాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంథని, సెప్టెంబర్ 09:
జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్)-2026లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని పట్టణంలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫోద్దిన్, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ శారదలను కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేసి సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేసిన అనంతరం, ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెల ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులతో పాటు జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా నమోదు చేస్తామని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావులేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని డివైస్‌ఓ వెంకటేశ్వర్లు, మంథని ఎంపీఎస్‌ఓ సంధ్యారాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.