శ్రీ కాళహస్తి, ఆగస్టు 01, (పున్నమి న్యూస్): ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలగా భావించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో కీలక ఘట్టమని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చరవాణి ద్వారా విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాకారం కావడం సంతోషకరమన్నారు. 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు పునాదులు వేసి, అవసరమైన అనుమతులు సాధించారని గుర్తు చేశారు. ఒకప్పుడు “అక్కడ ఎర్రబస్సు కూడా రాదు” అంటూ విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నేడు అదే ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం సమాధానమని వ్యాఖ్యానించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ కళాకారుడు రమేష్ రూపొందించిన కలంకారి కళా నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం హర్షణీయమని తెలిపారు. దీనివల్ల ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలుగు సంప్రదాయ కళా వైభవం పరిచయం కావడంతో పాటు శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భోగాపురం ప్రాజెక్టు పురోగతిపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న ఆయన, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి