Sunday, 27 September 2026
  • Home  
  • భారీ వర్షాలు: పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని రైతులకు సూచన
- అల్లూరి సీతారామరాజు

భారీ వర్షాలు: పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని రైతులకు సూచన

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు. పొలాల్లో నీరు నిల్వ కాకుండా కాలువలు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, కొండవాలుల్లో మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకట్టలు, కాంటూర్ బండ్లను బలోపేతం చేయాలని చెప్పారు. వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, రాగి పంటల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపాలన్నారు. అరటి, కూరగాయలు, యువ మొక్కలకు ఆధారాలు కట్టాలని తెలిపారు. అధిక తేమతో శిలీంధ్ర తెగుళ్లు రావచ్చు కాబట్టి వర్షం తగ్గాక పంటలను పరిశీలించి, అవసరమైతే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల సమయంలో విత్తనాలు, నాట్లు, ఎరువుల పనులు వాయిదా వేయాలని, కోతకు వచ్చిన పంటను వర్షం తగ్గాక కోసి పొడి ప్రదేశంలో భద్రపరచాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.