భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా జనగామ జిల్లా లో బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవన జ్యోతి ఆధ్వర్యంలో ధర్మ కంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో అంగన్వాడీ టీచర్ ల కు, ఆయాలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా గల భారత దేశం లో మహిళలంటే మోడీ కి చాలా గౌరవం, ఎక్కడ అయితే మహిళా మణులకు గౌరవం లభిస్తుందో అక్కడ ధర్మం, న్యాయం, సత్యం దేశ అభివృద్ధి లో ఉంటుంది అనేది ప్రధాని ప్రగాఢ నమ్మకం.కేంద్ర ప్రభుత్వం లో నిర్మల సీతా రామన్ మహిళకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పదవి ,ఢిల్లీ ముఖ్య మంత్రి పదవి కూడా మహిళ కే ఇవ్వడం జరిగింది. దేశ చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా మహిళా బిల్లు 33% పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది మోడీ ప్రభుత్వమే. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధానకార్యదర్శి తోకల ఉమా రాణి, మహిళ మోర్చా జిల్లా ఇంచార్జి ఎనగందుల కళ్యాణి, రమ, అవంతిక, నీలిమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు
Uploaded Video:





