Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

భారత జనగణన–2027పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారత జనగణన–2027పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారత జనగణన–2027 రెండో దశ జనాభా లెక్కింపు ప్రక్రియపై జిల్లా, మండల స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది.
  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.
  • వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నవంబర్ 17, 18 తేదీల్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారత జనగణన–2027 రెండో దశ జనాభా లెక్కింపు ప్రక్రియపై జిల్లా, మండల స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నవంబర్ 17, 18 తేదీల్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ జనగణన విభాగం జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్. సాయి శేఖర్ శిక్షణ అందిస్తున్నారు. జనాభా లెక్కింపు విధివిధానాలు, డిజిటల్ యాప్‌ల వినియోగం, సమాచార సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. జనగణనను కచ్చితత్వం, పారదర్శకతతో నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన, జనవరి 27, ఫిబ్రవరి 28 తేదీల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీపీఓ ప్రసాద్, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ తహశీల్దార్లు, జిల్లా సెన్సెస్ ఇన్‌చార్జి అనుకూర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *