Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

భద్రాచలం: మద్యం మత్తులో మహిళపై దాడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భద్రాచలం: మద్యం మత్తులో మహిళపై దాడి!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

భద్రాచలం: ఏషియన్‌ థియేటర్‌లో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు మద్యం సేవించి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆరోపించారు. కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలతో ప్రశాంతంగా సినిమా చూసేందుకు వచ్చిన తమకు ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని ప్రేక్షకులు తెలిపారు. ఘటనతో థియేటర్‌కు వచ్చిన మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. కుటుంబాలతో థియేటర్లకు వచ్చేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్‌లో మద్యం సేవించి వచ్చి ఇతర ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించే వారిపై యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా థియేటర్లలో భద్రతా చర్యలు పెంచి, కుటుంబ ప్రేక్షకులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *