Monday, 28 September 2026
  • Home  
  • భగత్ సింగ్ 119వ జయంతి సందర్బంగా నివాళులు, పాలాభిషేకం.
- నంద్యాల

భగత్ సింగ్ 119వ జయంతి సందర్బంగా నివాళులు, పాలాభిషేకం.

నంద్యాల: భగత్ సింగ్ 119వ జయంతి సందర్బంగా డి వై ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో స్థానిక డీగ్రీ కళాశాల మైదానంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం 21 సంవత్సరాలకే ప్రాణ త్యాగం చేసిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ గారు ఆయన ఆశయాల కోసం యువత కలిసికట్టుగా ముందుకు రావాలని అదేవిధంగా విద్యార్థులు యువకులు చెడు మార్గాలు పట్టకుండా దేశం బాగు కోసం అడుగులు వేయాలని వారిని కోరుతున్నామని అన్నారు. అనంతరం భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.నాయక్, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివ ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరుకు తన ఓటు హక్కును కాపాడుకునే అవకాశం కల్పించాలని, పారదర్శకతను పాటించాలని, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని డీవైఎఫ్‌ఐ, ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాయి. అనంతరం పట్టణంలో ఉన్నా భగత్ సింగ్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి రాఘవ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, చిన్న కులయప్ప, ఆంజనేయులు, రవి,ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి శివకుమార్, మున్నాఫ్, నాయుకులు నాగార్జున, వరుణ్, తేజ, తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల: భగత్ సింగ్ 119వ జయంతి సందర్బంగా డి వై ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో స్థానిక డీగ్రీ కళాశాల మైదానంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం 21 సంవత్సరాలకే ప్రాణ త్యాగం చేసిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ గారు ఆయన ఆశయాల కోసం యువత కలిసికట్టుగా ముందుకు రావాలని అదేవిధంగా విద్యార్థులు యువకులు చెడు మార్గాలు పట్టకుండా దేశం బాగు కోసం అడుగులు వేయాలని వారిని కోరుతున్నామని అన్నారు. అనంతరం భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.నాయక్, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివ ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరుకు తన ఓటు హక్కును కాపాడుకునే అవకాశం కల్పించాలని, పారదర్శకతను పాటించాలని, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని డీవైఎఫ్‌ఐ, ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాయి. అనంతరం పట్టణంలో ఉన్నా భగత్ సింగ్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి రాఘవ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, చిన్న కులయప్ప, ఆంజనేయులు, రవి,ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి శివకుమార్, మున్నాఫ్, నాయుకులు నాగార్జున, వరుణ్, తేజ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.