Sunday, 23 August 2026
  • Home  
  • బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వస్తావు
- విశాఖపట్నం

బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వస్తావు

🌏 తొట్లకొండ–రుషికొండ బీచ్‌లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ విశాఖపట్నం జిల్లా, ( పున్నమి ప్రతినిధి), ఆగస్టు 21: విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల కీలక సమావేశాలకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం నగరానికి గర్వకారణంగా నిలవనుంది. అతిథుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, మౌలిక వసతులు, పర్యాటక ప్రాంతాల అందం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్రిక్స్ దేశాల యువత, క్రీడా రంగాల అభివృద్ధి, పరస్పర సహకారానికి వేదికగా నిలిచే ఈ సమావేశాలు విశాఖ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేయనున్నాయి.

🌏

తొట్లకొండ–రుషికొండ బీచ్‌లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

విశాఖపట్నం జిల్లా, ( పున్నమి ప్రతినిధి), ఆగస్టు 21:
విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల కీలక సమావేశాలకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.

అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం నగరానికి గర్వకారణంగా నిలవనుంది. అతిథుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, మౌలిక వసతులు, పర్యాటక ప్రాంతాల అందం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

బ్రిక్స్ దేశాల యువత, క్రీడా రంగాల అభివృద్ధి, పరస్పర సహకారానికి వేదికగా నిలిచే ఈ సమావేశాలు విశాఖ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేయనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.