అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట పంచాయతీ,బొర్రపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంగన్వాడీ కార్యకర్త కె.గౌరమ్మ ఆధ్వర్యంలో చిన్నారులు,గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
రోజువారీ ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెరను పరిమితంగా వినియోగించాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు వంటి స్థానిక పోషకాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. THR, HCM మెనూతో పాటు స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శించారు.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి, చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించడమే పోషణ మాసం లక్ష్యమని గౌరమ్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త గౌరమ్మ ఆయా,వసుందర,ఆశ వర్కర్,జమ్ములమ్మ,ఘర్భిణీస్త్రీ లు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



