Sunday, 16 August 2026
  • Home  
  • బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. డక్కలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఎస్. బాలు, శైలజతో కలిసి మోటార్‌సైకిల్‌పై నెల్లూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంపల్లి క్రాస్‌ రోడ్డుకు చేరుకునే సమయంలో బాలు నిద్రమత్తులోకి వెళ్లడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో బాలుకు తీవ్ర గాయాలు కాగా, శైలజకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు తరలించారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ ఎస్‌ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. డక్కలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఎస్. బాలు, శైలజతో కలిసి మోటార్‌సైకిల్‌పై నెల్లూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంపల్లి క్రాస్‌ రోడ్డుకు చేరుకునే సమయంలో బాలు నిద్రమత్తులోకి వెళ్లడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో బాలుకు తీవ్ర గాయాలు కాగా, శైలజకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు తరలించారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ ఎస్‌ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.