ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చాలా కాలంగా నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీవాసుల విజ్ఞప్తిపై స్పందించిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి సరఫరా వ్యవస్థలోని లోపాలను సరిచేసి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం కాలనీకి నిరంతరాయంగా త్రాగునీరు అందుతోంది. సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా శాశ్వత ప్రణాళికలు అమలు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

బీసీ కాలనీకి నీటి ఊరట
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చాలా కాలంగా నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీవాసుల విజ్ఞప్తిపై స్పందించిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి సరఫరా వ్యవస్థలోని లోపాలను సరిచేసి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం కాలనీకి నిరంతరాయంగా త్రాగునీరు అందుతోంది. సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా శాశ్వత ప్రణాళికలు అమలు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

