డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఓడలరేవులోని బోనం వెంకట చలమయ్య ఇంజినీరింగ్ కాలేజీలో 2022-26 బ్యాచ్ విద్యార్థుల కోసం అచీవర్స్ డే, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 670 మంది బీటెక్, 26 మంది ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన 530 మంది విద్యార్థులను సత్కరించారు. అత్యధికంగా రూ.10 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించిందని యాజమాన్యం తెలిపింది. కళాశాల 94 శాతం ఉత్తీర్ణత సాధించింది. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభ్యున్నతికి వినియోగించాలని వక్తలు సూచించారు. నాణ్యమైన సాంకేతిక విద్య, శిక్షణ, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, హ్యాకథాన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖులు, అధ్యాపకులు, విభాగాధిపతులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.



