Sunday, 13 September 2026
  • Home  
  • బీఆర్‌ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ రెడ్డి
- వరంగల్

బీఆర్‌ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ రెడ్డి

నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. నల్లబెల్లి మండల బీజేపీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో మామిండ్ల మోహన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీకి రోజురోజుకూ ప్రజల నుంచి,వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తల నుంచి పెరుగుతున్న మద్దతుకు ఈ చేరిక నిదర్శనమన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేసి,ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన మోహన్ రెడ్డి మాట్లాడుతూ..దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరియు నర్సంపేట నియోజకవర్గంలో రాణా ప్రతాప్ రెడ్డి ప్రజలకు చేస్తున్నసేవ విధానం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు వెంకటేశ్వర్ రావు, మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి , ముచ్చింపుల గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతి కుమార్ ,యువ మోర్చా నాయకులు తిమ్మాపురం శివ పాల్గొన్నారు.

నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.
నల్లబెల్లి మండల బీజేపీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో మామిండ్ల మోహన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీకి రోజురోజుకూ ప్రజల నుంచి,వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తల నుంచి పెరుగుతున్న మద్దతుకు ఈ చేరిక నిదర్శనమన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేసి,ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.
అనంతరం పార్టీలో చేరిన మోహన్ రెడ్డి మాట్లాడుతూ..దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరియు నర్సంపేట నియోజకవర్గంలో రాణా ప్రతాప్ రెడ్డి ప్రజలకు చేస్తున్నసేవ విధానం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు వెంకటేశ్వర్ రావు, మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి , ముచ్చింపుల గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతి కుమార్ ,యువ మోర్చా నాయకులు తిమ్మాపురం శివ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.