బిజినపల్లి: బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు అంధకారమవుతుందని, వాటిని అరికట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని నాగర్కర్నూల్ సీడీపీఓ సంగీత పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బిజినపల్లి, మమ్మాయిపల్లి, శాయిన్పల్లి, మంగనూరు గ్రామాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగయ్య, ఉపసర్పంచ్ రాములు, సఖి కేంద్రం ప్రతినిధి సునీత, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.



