ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఖానాపురంలోని అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల కోసం సుమారు 500 మందికి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు గంటాల విద్యాసాగర్ ప్రారంభించారు. అలాగే ఖమ్మం పాత బస్టాండ్ వద్ద మరో 500 మందికి భోజన ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని గల్లా సత్యనారాయణ ప్రారంభించారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్న ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని యువ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లారావు గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్‌కు బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. సామాన్య కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని బండి సంజయ్ జీవితం నిరూపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో అనేక పర్యటనలు చేసి కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాల్లో నకిరికంటి వీరభద్రం, పిల్లలమర్రి వెంకట్, వెంకటనారాయణ యాదవ్, మంద సరస్వతి, వాకదాని రామకృష్ణ, గడీల నరేష్, డీకొండ శ్యామ్, శాసనాల సాయిరాం, వల్లాల రమేష్, కొమ్మ మధు, రీగన్ ప్రతాప్, రుద్రగాని మాధవ్, పసుమర్తి సతీష్, ఉరవకొండ ఖాదర్, రాము తదితరులు పాల్గొన్నారు.



