Friday, 18 September 2026
  • Home  
  • ఫ్లాష్ న్యూస్: నాయుడుపేటలో రాత్రి వేళ ఓపెన్ లో ఉన్న సహకార సంఘ కార్యాలయం.*
- తిరుపతి

ఫ్లాష్ న్యూస్: నాయుడుపేటలో రాత్రి వేళ ఓపెన్ లో ఉన్న సహకార సంఘ కార్యాలయం.*

*నాయుడుపేట (తిరుపతి జిల్లా), సెప్టెంబర్ 17 *నిబంధనలకు పాతర వేస్తూ, అధికారిక పనివేళలు ముగిసి 3 గంటలు గడిచి ప్రస్తుతం రాత్రి అవుతున్నా నాయుడుపేట పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం ఇంకా తెరిచే ఉండటం అనేక ఆలోచనలకు తావునిస్తుంది. సాధారణంగా సాయంత్రానికే తాళాలు పడాల్సిన ఈ ప్రభుత్వ అనుబంధ కార్యాలయంలో, ఈ అపరాత్రి వేళ కూడా లైట్లు వెలుగుతూ అధికారులు, సిబ్బంది లోపల తిష్ట వేయడంపై స్థానిక ప్రజలు, రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. పగటిపూట రైతులు వస్తే సర్వర్లు పని చేయడం లేదంటూ, ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ తిప్పలు పెట్టే అధికారులు, ఈ చీకటి వేళల్లో ఎవరి కోసం తలుపులు తీసి ఉంచారు? రికార్డులను తారుమారు చేసేందుకు ఏమైనా మాయాజాలం నడుస్తోందా? లేక నిధుల దారిమళ్లింపునకు సంబంధించిన గుట్టుచప్పుడు కాకుండా స్కెచ్ వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతకు పాతరేస్తూ సాగుతున్న ఈ రాత్రి భాగోతంపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు మరియు సహకార శాఖ అధికారులు తక్షణమే స్పందించి నిఘా పెట్టాలని, నాయుడుపేట పీఏసీఎస్ కార్యాలయంపై తక్షణ తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.*

*నాయుడుపేట (తిరుపతి జిల్లా), సెప్టెంబర్ 17
*నిబంధనలకు పాతర వేస్తూ, అధికారిక పనివేళలు ముగిసి 3 గంటలు గడిచి ప్రస్తుతం రాత్రి అవుతున్నా నాయుడుపేట పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం ఇంకా తెరిచే ఉండటం అనేక ఆలోచనలకు తావునిస్తుంది. సాధారణంగా సాయంత్రానికే తాళాలు పడాల్సిన ఈ ప్రభుత్వ అనుబంధ కార్యాలయంలో, ఈ అపరాత్రి వేళ కూడా లైట్లు వెలుగుతూ అధికారులు, సిబ్బంది లోపల తిష్ట వేయడంపై స్థానిక ప్రజలు, రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. పగటిపూట రైతులు వస్తే సర్వర్లు పని చేయడం లేదంటూ, ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ తిప్పలు పెట్టే అధికారులు, ఈ చీకటి వేళల్లో ఎవరి కోసం తలుపులు తీసి ఉంచారు? రికార్డులను తారుమారు చేసేందుకు ఏమైనా మాయాజాలం నడుస్తోందా? లేక నిధుల దారిమళ్లింపునకు సంబంధించిన గుట్టుచప్పుడు కాకుండా స్కెచ్ వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతకు పాతరేస్తూ సాగుతున్న ఈ రాత్రి భాగోతంపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు మరియు సహకార శాఖ అధికారులు తక్షణమే స్పందించి నిఘా పెట్టాలని, నాయుడుపేట పీఏసీఎస్ కార్యాలయంపై తక్షణ తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.