ఖమ్మం
(పున్నమి న్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఖమ్మం ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శాసనాల శ్రీరామ్, జిల్లా నాయకుడు దీకొండ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై అవగాహన కల్పిస్తూ, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ, మిస్డ్ కాల్ కార్యక్రమాలకు విద్యార్థులు విశేష స్పందన తెలిపి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

