నలుబై వేల మంది విద్యార్థులకు ఫీజు రియింబుర్సు్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలి :సౌడ రమేష్ బిజెపి జిల్లా అధ్యక్షులు
————————————————————–
జనగామ, ఆగష్టు 30,పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం లో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ రేపు అనగా 31/8/2026 ఉదయం 10:00 నుండి జిల్లా కేంద్రం చౌరస్తాలో 40,000 మంది విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలని దీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్షను విజయవంతం చేయాలని భాజపా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల పక్షాన భాజాపా పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థులకు అందించే వరకు భాజపా ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పిడుగుల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి జిల్లా సెక్రెటరీ సతీష్ జగదీష్ పూల చందర్ తదితరులు పాల్గొన్నారు


