ఫార్మాసిటీ భూములపై కీలక సమావేశం.. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
రంగారెడ్డి జిల్లా, జూలై 22:
ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వని నాలుగు గ్రామాల రైతుల సమస్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి కీలక సమావేశం నిర్వహించారు.
సుమారు 2,000 ఎకరాల భూమి మినహాయింపు అంశంపై రైతుల అభ్యర్థనలను మంత్రి పరిశీలించారు. భూములను ఏ విధంగా మినహాయించవచ్చనే అంశంపై టీజీఐఐసీ (TGIIC) అధికారులు, జిల్లా కలెక్టర్ సమగ్రంగా చర్చించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుల సమస్యలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమావేశంతో భూమి మినహాయింపు అంశంపై రైతుల్లో మరోసారి ఆశలు చిగురించాయి.






