జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ గోడలు దెబ్బతినడంతో పాటు సిమెంట్ నిర్మాణం పలు చోట్ల కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా సాగునీరు అందే వందల ఎకరాల పంటలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలపై గతంలో కూడా స్థానికంగా పలుమార్లు డిమాండ్లు వినిపించాయి.

ప్రమాదకరంగా మారిన నవాబుపేట ప్రధాన కాలువ.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి.