Monday, 17 August 2026
  • Home  
  • ప్రమాదకరంగా చీకట్లో పేరూరు–చెర్లోపల్లి రోడ్డు
- తిరుపతి

ప్రమాదకరంగా చీకట్లో పేరూరు–చెర్లోపల్లి రోడ్డు

వీధి దీపాలు లేక వాహనదారుల బిక్కుబిక్కు – పశువుల సంచారంతో మరింత ప్రమాదకరంగా మారిన రహదారి తక్షణమే వీధిలైట్లు వేయించాలని సిపిఎం ఆర్డిఓకు వినతి…… తిరుపతి రూరల్ ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పేరూరు బస్టాప్ నుంచి చెర్లోపల్లి జంక్షన్ వరకు రహదారి రాత్రి వేళల్లో ప్రమాదకరంగా మారిందని, ఈ మార్గంలో ప్రయాణించే యాక్సిడెంట్ కి భయపడి జనసంచారం జరగడం లేదు. కాబట్టి తక్షణమే వీధిలైట్లు వేయించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి రెవిన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వింత పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర తిరుపతి రూరల్ కార్యదర్శి కే సుమన్ ఇవ్వడం జరిగింది పేరూరు బస్టాప్ నుండి చెర్లోపల్లి జంక్షన్ వరకు రహదారిపై డివైడర్లకు సెంట్రల్ వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ మొత్తం మార్గం చీకటిమయం అవుతోంది. బెంగళూరు వైపు నుండి చంద్రగిరి మీదుగా తిరుపతికి వచ్చే వాహనాలతో పాటు, తిరుపతి నగరంలో విధులు ముగించుకుని రాత్రి సమయంలో రూరల్ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లే వేలాది మంది ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తున్నారు…. ప్రత్యేకంగా అగ్రికల్చర్ కళాశాల మీదుగా, తాటితోపు మార్గం ద్వారా గ్రామాలకు వెళ్లే ప్రజలు రాత్రివేళ చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రికల్చర్ కళాశాల క్యాంపస్ వరకు డివైడర్లపై వీధి దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడి నుంచి పేరూరు–చెర్లోపల్లి వైపు ఉన్న సుమారు 2 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా సెంట్రల్ డివైడర్లపై వున్న 31 వీధి దీపాలు ఏర్పాటు చేస్తే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చీకటికి తోడు రోడ్డుపై పశువుల సంచార జరుగుతుంది.ఇప్పటికే వీధి దీపాలు లేక చీకటిగా ఉన్న ఈ రహదారిపై పేరూరు గ్రామం నుండి ఆవులు, గేదెలు, మేకలను గుంపులుగా రోడ్డుపైకి తోలుకురావడం మరింత ప్రమాదకరంగా మారుతోంది. చీకట్లో పశువులు డివైడర్ల మధ్య నుంచి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, ఒక వైపు నుండి మరో వైపుకు దాటడం వల్ల వాహనదారులు వాటిని ముందుగా గుర్తించలేకపోతున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురయ్యే పశువులు చనిపోతున్నాయి అదేవిధంగా అక్కడ యాక్సిడెంట్ గురై మనుషులు చనిపోతున్నారు. పశువులను రోడ్లపైకి వదిలేస్తున్న వారి విషయంలో సంబంధిత అధికారులు తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు చీకటి, మరోవైపు రోడ్డుపై పశువుల సంచారం కలిపి ఈ రహదారిని ప్రమాదకరంగా మారినాయి. టీటీడీ, జిల్లా అధికారులు స్పందించాలి అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్ వరకు టీటీడీ ఆధ్వర్యంలో డివైడర్లకు వీధి దీపాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, మిగిలిన సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా టీటీడీ లేదా సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సెంట్రల్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఈ మార్గం కేవలం స్థానిక ప్రజల రాకపోకలకు మాత్రమే కాకుండా తిరుపతి–చంద్రగిరి ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రజలకు కూడా ముఖ్యమైనది. రాత్రివేళ వేలాది మంది ప్రయాణించే రహదారిపై కనీస వెలుతురు కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. పేరూరు–చెర్లోపల్లి రహదారిపై వెంటనే సెంట్రల్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, అవసరమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. పేరూరు–చెర్లోపల్లి రహదారికి వెంటనే వెలుగులు ఇవ్వాలి – ప్రజల ప్రాణాలను కాపాడాలి. కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం…. కే సుమన్ సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి

వీధి దీపాలు లేక వాహనదారుల బిక్కుబిక్కు – పశువుల సంచారంతో మరింత ప్రమాదకరంగా మారిన రహదారి
తక్షణమే వీధిలైట్లు వేయించాలని సిపిఎం ఆర్డిఓకు వినతి……

తిరుపతి రూరల్ ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి

తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పేరూరు బస్టాప్ నుంచి చెర్లోపల్లి జంక్షన్ వరకు రహదారి రాత్రి వేళల్లో ప్రమాదకరంగా మారిందని, ఈ మార్గంలో ప్రయాణించే యాక్సిడెంట్ కి భయపడి జనసంచారం జరగడం లేదు. కాబట్టి తక్షణమే వీధిలైట్లు వేయించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి రెవిన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వింత పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర తిరుపతి రూరల్ కార్యదర్శి కే సుమన్ ఇవ్వడం జరిగింది
పేరూరు బస్టాప్ నుండి చెర్లోపల్లి జంక్షన్ వరకు రహదారిపై డివైడర్లకు సెంట్రల్ వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ మొత్తం మార్గం చీకటిమయం అవుతోంది. బెంగళూరు వైపు నుండి చంద్రగిరి మీదుగా తిరుపతికి వచ్చే వాహనాలతో పాటు, తిరుపతి నగరంలో విధులు ముగించుకుని రాత్రి సమయంలో రూరల్ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లే వేలాది మంది ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తున్నారు….
ప్రత్యేకంగా అగ్రికల్చర్ కళాశాల మీదుగా, తాటితోపు మార్గం ద్వారా గ్రామాలకు వెళ్లే ప్రజలు రాత్రివేళ చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రికల్చర్ కళాశాల క్యాంపస్ వరకు డివైడర్లపై వీధి దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడి నుంచి పేరూరు–చెర్లోపల్లి వైపు ఉన్న సుమారు 2 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా సెంట్రల్ డివైడర్లపై వున్న 31 వీధి దీపాలు ఏర్పాటు చేస్తే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చీకటికి తోడు రోడ్డుపై పశువుల సంచార జరుగుతుంది.ఇప్పటికే వీధి దీపాలు లేక చీకటిగా ఉన్న ఈ రహదారిపై పేరూరు గ్రామం నుండి ఆవులు, గేదెలు, మేకలను గుంపులుగా రోడ్డుపైకి తోలుకురావడం మరింత ప్రమాదకరంగా మారుతోంది.
చీకట్లో పశువులు డివైడర్ల మధ్య నుంచి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, ఒక వైపు నుండి మరో వైపుకు దాటడం వల్ల వాహనదారులు వాటిని ముందుగా గుర్తించలేకపోతున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురయ్యే పశువులు చనిపోతున్నాయి అదేవిధంగా అక్కడ యాక్సిడెంట్ గురై మనుషులు చనిపోతున్నారు.
పశువులను రోడ్లపైకి వదిలేస్తున్న వారి విషయంలో సంబంధిత అధికారులు తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు చీకటి, మరోవైపు రోడ్డుపై పశువుల సంచారం కలిపి ఈ రహదారిని ప్రమాదకరంగా మారినాయి.
టీటీడీ, జిల్లా అధికారులు స్పందించాలి
అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్ వరకు టీటీడీ ఆధ్వర్యంలో డివైడర్లకు వీధి దీపాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, మిగిలిన సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా టీటీడీ లేదా సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సెంట్రల్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
ఈ మార్గం కేవలం స్థానిక ప్రజల రాకపోకలకు మాత్రమే కాకుండా తిరుపతి–చంద్రగిరి ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రజలకు కూడా ముఖ్యమైనది. రాత్రివేళ వేలాది మంది ప్రయాణించే రహదారిపై కనీస వెలుతురు కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత.
పేరూరు–చెర్లోపల్లి రహదారిపై వెంటనే సెంట్రల్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, అవసరమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి.
పేరూరు–చెర్లోపల్లి రహదారికి వెంటనే వెలుగులు ఇవ్వాలి – ప్రజల ప్రాణాలను కాపాడాలి. కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం….
కే సుమన్
సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.