శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ ముఖద్వారమైన పానగల్ వద్ద గల నక్కల కాలువ వంతెనను వర్షాకాలం పెను ప్రమాదం నుండి కాపాడాలని కోరుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో మున్సిపాలిటీ వారు ఇక్కడ మురుగునీటి కాలువను అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించి వంతెన రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) పూర్తిగా దెబ్బతిన్నదని, దీనివల్ల వంతెన మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే వర్షాకాలంలో వరద తీవ్రతకు వంతెన కూలిపోయి పెను ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. తమ విన్నపంపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను తక్షణమే సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. నక్కల కాలువ వద్ద నూతనంగా పక్కా కాలువ నిర్మాణం చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండలం అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, సీనియర్ నాయకులు నాగూరయ్యా, ముని కృష్ణయ్య, చందు, నాగరాజు, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదం అంచున పానగల్ వంతెన-మున్సిపల్ కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం