వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజం వెంకమ్మ శుక్రవారం ప్రభుత్వ భూమి ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కొండాయపాలెం రెవెన్యూ సర్వే నెం.148-1లోని ప్రభుత్వ భూమిని తాను 2009 నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని వినతిపత్రంలో పేర్కొన్నారు.గతంలో ఇదే భూమిలో జేసీబీతో పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం చిందె ప్రసాద్, చిందె రోజా ఆ బోర్డును తొలగించి మళ్లీ జేసీబీతో పనులను నిర్వహిస్తున్నారని,అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి రక్షించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తాను సాగు చేస్తున్న భూమిపై తన హక్కులను పరిరక్షించి పట్టా మంజూరు చేయాలని తహసీల్దార్‌ను వెంకమ్మ కోరారు

ప్రభుత్వ భూమి ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు